రేేషన్‌ డీలర్ల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా మంత్రి గంగుల

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రేషన్‌ డీలర్ల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆయన రేషన్‌ డీలర్ల జేఏసీ ప్రతినిధులతో సమావేశయ్యారు. ఈ సందర్భంగా ఆయా ప్రతినిధులు మాట్లాడుతూ రేషన్‌ పోర్టబులిటీ తదితర కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లోని రేషన్‌ డీలర్లు గణనీయం గా ఆదాయాన్ని కోల్పోయారని తెలిపారు. వారికి గౌరవప్రదమైన కమిషన్‌ వచ్చే లా చర్యలు తీసుకోవాలని కోరారు, గ్రా మీణ, మున్సిపల్‌, కార్పోరేషన్‌ పరిధిల్లో ని రేషన్‌ డీలర్లకు సమ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.