దళిత డిక్లరేషన్‌ పై మంత్రి కొప్పుల ఆగ్రహం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ దళిత గిరిజన డిక్లరేషన్‌ పచ్చి మోసమని ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. అధికారంలో ఉన్నంత కాలం ఏమి ఒరగబెట్టారని ఇప్పుడు డిక్లరేషన్లు ప్రకటిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల బాగోగులు ఏనాడు పట్టించుకోని వాళ్లంతా ఎన్నికలు వస్తున్నాయానగానే కొత్త పల్లవి ఎత్తు కుంటారని ఎద్దేవా చేశారు. దళితులు, గిరిజనులపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా.. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించారు.