నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అధిక ధరలకు పత్తి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. బీగ్ 11 450 గ్రాముల ప్యాకెట్‌కు పత్తి విత్తనాల ధర రూ 853కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. అంతకు మించి అమ్మితే చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని కంపెనీల పత్తి విత్తనాలు ఒకటే రకమైనవి ఇవన్నీ ఉత్పత్తి చేసేది ప్రయివేటు కంపెనీలేనని తెలిపారు. కొన్ని కంపెనీలు దురాశతో కృత్రిమ విత్తనాల కొరత సష్టించి ఎక్కువ ధరకు మార్కెట్లో అమ్ముతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అటువంటి డీలర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు.