విగ్రహాల ప్రారంభోత్సవాలలో మంత్రి వేముల

– అన్నదాన కార్యక్రమం
– విగ్రహాల శోబయత్ర
నవతెలంగాణ – మాక్లూర్ 
మండల కేంద్రంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, కుటుంబ సభ్యులు శ్రీ రుక్మిణీ పాండురగా, శ్రీ అయ్యప్ప, హన్మన్ నూతన ఆలయాలను నిర్మించారు. సోమవారం ఆలయాల ప్రారంభోత్సవాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా జెడ్పీ చైర్మన్ ది. విఠల్ రావు, ఎంపి సురేష్ రెడ్డి వీక్షించారు. వారికి బిగల గణేష్ గుప్త సన్మానించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేదమంత్రాల మధ్య గ్రామంలోని హాన్మన్ మ్మదిరం నుంచి విగ్రహాలను శోబయత్రగా మహిళలు మంగళ హారతులతో, యువకులు ప్రత్యేక దుస్తులతో నృత్యాలు చేస్తూ నూతన మందిరం వరకు తీసుక వెళ్ళారు. జలదివాసం చేశారు. అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు యువకులు, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.