నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గురువారం ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవల మహిపాల్‌రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పటాన్‌చెరులోని ఆయన ఇంటికి వెళ్లిన హరీశ్‌రావు కుటుంబ సభ్యులను ఓదార్చి..వారికి ధైర్యం చెప్పారు.