అసెంబ్లీలో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకులను మాట్లాడనివ్వలేదు

నవతెలంగాణ- కంటేశ్వర్
కాంగ్రెస్ భవన్ నందు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి  పీసీసీ ఉపాధ్యక్షులు తాహిర్బీన్ హాందాన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడు టిఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులను మాట్లాడా నివ్వకుండా వారు ఏదైనా మాట్లాడిన అడిగిన ముకుమ్మడిగా వారిపై దాడి చేస్తున్నారని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తప్పుడు మాటలను చెబుతుందని రాష్ట్ర ప్రజలు వాటిని గమనించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వాటిని తప్పించుకోవడానికి అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలో తీయలేనంత నీచ స్థితిలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారని,  కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు చేక్ డ్యామ్ లు శాస్త్రీయంగా నిర్మాణం కాలేవని మాట్లాడితే దానిని మార్చేసి కాంగ్రెస్ చెక్ డ్యామ్ లనే వద్దంటుంది అని కేటీఆర్ మాట్లాడుతున్నాడని కానీ కాంగ్రెస్ పార్టీ చెక్ డ్యామ్లకు వ్యతిరేకం కాదని ఏవైతే ఇంజనీర్ల లోపం వలన అనాలోచిత విధానాల వల్ల కమిషన్ల కోసం కట్టిన చెక్ డ్యామ్ ల వల్ల పంటలు నష్టపోతున్నాయని, చెక్ డ్యాములు నిర్మించాలంటే అక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దానిని డిజైన్ చేయాలి ,కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆఫీసులలో కూర్చొని రాష్ట్రమంతటా ఒకే చెక్ డ్యామ్ డిజైన్ నిర్మించింది అని ,తద్వారా చాలా ప్రాంతాలలో  పంటలు నష్టపోయాయని అన్వేష్ రెడ్డి అన్నారు ,నిజామాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గం లో చాలా పంటలు చెక్ డ్యామ్ ద్వారా నష్టపోయారని, అదేవిధంగా మంత్రి హరీష్ రావు, మంత్రి కేటీఆర్ నియోజకవర్గాలలో కూడా చాలామంది పంటలు నష్టపోయారని ఆయన అన్నారు .అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలలో ఎక్కడ కూడా రైతుల నష్టపరిహారం పై చర్చించలేదని కాంగ్రెస్ నాయకులు నష్టపరిహారం ఏ పంటకు ఎంత ఇవ్వాలని ప్రశ్నిస్తే మంత్రి కేటీఆర్ నివేదిక రాకముందు ఇలా చెప్తాము అని అన్నాడని ,మరి మే నెలలో అకాల వర్షాలతో రైతులు పంట పొలాలను నష్టపోతే కేసిఆర్ ఏ విధంగా నివేదిక రాకముందే వరి పంటకు పదివేల రూపాయల నష్టపరిహారం ప్రకటించాడో చెప్పాలని, నివేదిక అనేది పొలం ఎన్ని ఎకరాలు నష్టపోయారు మాత్రమే చెప్తుందని, ఏ పంటకు ఎంత నష్టపరిహారం ఇవ్వాలో చెప్పడానికి మంత్రి కేటీఆర్ కు ఎందుకు ఆలోచిస్తున్నాడో సమాధానం చెప్పాలని ఆయన అన్నారు, మరో పక్క ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తుందని తద్వారా రైతులకు రైతుబంధు రాదని అంటున్నాడని ,రైతుబంధుకు ధరణికి సంబంధమే లేదని ధరణి అనేది ఆన్లైన్ వెబ్సైట్ మాత్రమే అని దానితో రైతుబంధుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. నిజానికి ధరణి రైతులకు మేలు చేస్తే ఎందుకు రోజుకు ఒక్కొక్క గ్రామంలో వందలాదిమంది పట్టా బుక్కులకు వేచి చూస్తున్నారని, ఒకవేళ ధరణి వెబ్సైట్ను నడుపుతున్న వ్యక్తి ఏదైనా వెబ్సైట్ క్లోజ్ అయితే పేద భూముల పరిస్థితి ఏంది అని, కాంగ్రెస్ పార్టీ అనేది మాన్యువల్ గా భూమి యొక్క రికార్డులను ఉంచుతూ అదేవిధంగా డిజిటల్ లో కూడా చేయాలని చెప్తుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం అది పట్టించుకోకుండా కేవలం డిజిటల్ లోనే చేస్తుందని, తద్వారా ఆన్లైన్లో ఏదైనా సమస్య వస్తే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.అదేవిధంగా పోడు భూములకు పట్టాల విషయంలో కేటీఆర్ మాట్లాడుతూ కేవలం మాత్రమే పట్టాలు ఇస్తామని చెప్తున్నాడని, అర్బన్ ఏరియాలలో ఉన్నది కేవలం టిఆర్ఎస్ నాయకుల వద్దనేనని పోడు భూములు, కానీ రూరల్ ఏరియాలలో సాగు చేస్తున్న రైతుల వద్ద పోడు భూములు ఉన్నాయని ఒకవేళ పోడు భూములకు పట్టాలు ఇస్తే రూరల్ ఏరియాలలో సాగు చేసుకునే రైతులకు ఇవ్వాలి కానీ భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అర్బన్ ఏరియాలలో ఉన్న టిఆర్ఎస్ నాయకులకు ఏ విధంగా ఇస్తారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ప్రజలకు మేలు చేయాల్సింది పోయి పెద్ద వ్యాపారులకు ప్రభుత్వ భూములు అంటగడుతుందని, పేద ప్రజల నుండి మూడు నాలుగు లక్షలకు భూములను తీసుకొని అమెజాన్ మరియు ఇతర పెద్ద కంపెనీలకు కోట్ల రూపాయలతో ప్రభుత్వం అమ్ముతుందని దీనిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి ,రాజా నరేందర్ గౌడ్, సంతోష్, రామకృష్ణ ,కేశ మహేష్ ,శుభం, శోభన్ ,ఆవిన్ తదితరులు పాల్గొన్నారు.