మైనారిటీ సోదరులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తాం

– బీఆర్‌ఎస్‌ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
మైనారిటీ సోదరులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని బీఆర్‌ఎస్‌ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. శుక్రవారం వికారాబాద్‌ పట్టణ కేంద్రంలోని క్లబ్‌ ఫంక్షన్‌హాల్‌లో ముస్లీం మైనార్టీ సోదరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన హాజరయ్యారు. ముస్లీం, మైనార్టీలకు శ్మశాన వాటిక , ఫంక్షన్‌హాల్‌ ఏర్పాటుకు 3.4 (మూడు ఎకరాల నాలుగు గుంటల) స్థలాన్ని కేటాయించి ప్రొసిడింగ్‌ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మునుపేన్నడూ లేని విధంగా మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వికారాబాద్‌లో ఫంక్షన్‌ హాల్‌, ముస్లింలకు శ్మశాన వాటిక నిర్మాణానికి స్థలం కేటాయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఎండీ తస్వర్‌ అలీ, హఫీజ్‌, న్యాయవాది మహమ్మద్‌రఫీ, పీఎసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, కౌన్సిలర్‌ అనంతరెడ్డి, ఎండి బషీర్‌, ముర్తుజ్‌ అలీ, సిద్ధిఖీ, షకీల్‌, షఫీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
28