మిషన్‌ భగీరథ కార్మికుల సమ్మె

– పంపు ఆపరేటర్లను కొనసాగించాలని డిమాండ్‌
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్‌
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మిషన్‌ భగీరథ కార్మికులు నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం వద్ద చేస్తున్న సమ్మె మంగళవారానికి రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మిషన్‌ భగీరథ కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్‌ జంజిరాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. వీఆర్‌ఏలను పంపు ఆపరేటర్లుగా రిక్రూట్‌ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సంబంధిత సర్టిఫికెట్‌ను కలిగి 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లను కొనసాగించాలని కోరారు. మిషన్‌ భగీరథ ఎస్‌ఈ సురేష్‌ కుమార్‌, డిఈలు రామకృష్ణ, గిరిధర్‌, సీయాన్‌ కాంట్రాక్టర్‌ శేఖర్‌ కార్మికుల వద్దకు వచ్చి సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పినట్టు తెలిపారు. ఈ సమ్మెలో ఆ సంఘం కో చైర్మెన్లు టి.కృష్ణ, బి.వెంకటేశం, కార్యదర్శులు ఎండి.జానీ, ఎన్‌.శ్రీను, కె.సైదులు, లక్ష్మమ్మ, యాదమ్మ, సైదులు, శంకర్‌, రఫీ, వెంకటమ్మ, నరేందర్‌, మల్లేష్‌, నరేందర్‌, కృష్ణ, రవి, మధు తదితరులు పాల్గొన్నారు.