ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల భాగంగా వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే గణేష్ బిగాల బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చెందిన మహిళలకు కేసీఆర్ కిట్ ని అందచేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.కడుపు కోత లేకుండా సాధ్యమైనంత వరకు ఎక్కువ సాధారణ ప్రసవాలు చేస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన కేసీఆర్ బువ్వ కుండ” కేంద్రంలో రోగులకు మరియు వారి సహాయకులకి భోజనాన్ని వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి,రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మీ, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకురాలు ప్రతిమ రాజ్ రెడ్డి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరా డి ఎం హెచ్ ఓ సూదర్శనం, కార్పొరేటర్లు భైఖాన్ సుధ మధు, అబ్దుల్ కుద్దుస్, బాబ్ల్యూ ఖాన్, ఉమారని, బి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు.