బస్తీ ధవాఖానాను ప్రారంభించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల 34వ డివిజన్ మిర్చి కంపౌండ్ లో బస్తీ ధవాఖానను బుధవారం ప్రారంభించారు. జిల్లా ఆస్పత్రితో పాటు బస్తీ దావకానలను ఏర్పాటు చేయడం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకె సాధ్యమైందని ఇలాంటి బస్తి దావకానాల వలన ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బురుగుపల్లి కల్పన, నుడ డైరెక్టర్ మల్లేష్ గుప్తా బీఆర్ఎస్ నాయకులు జుగల్ కిషోర్ పాండే, బీఆర్ఎస్ నాయకులు దండు శేఖర్, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.