శంకర్‌పల్లిని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

నవతెలంగాణ-శంకర్‌పల్లి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడానికి శాయశక్తుల కృషి చేస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం శంకర్‌పల్లి మున్సిపల్‌ పరిధిలో నాయకులతో కలిసి అన్ని వార్డులలో తిరిగి పనులను పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏయే పనులు, వార్డులకు నిధులు ఎలా కేటాయించాలని స్థానిక నేతల ద్వారా అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి తారక రామారావు మున్సిపల్‌ అభివృద్ధి కోసం రూ.25 కోట్లు నిధులు మంజూరు చేయడంతో వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి ప్రవీణ్‌ కుమార్‌, వైస్‌ చైర్మన్‌ వెంకటరామ్‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌ శశిధర్‌రెడ్డి, వార్డు కౌన్సిలర్లు శ్రీనాథ్‌గౌడ్‌ చంద్రమౌళి, నాయకులు అశోక్‌ కుమార్‌, గోపాల్‌ రెడ్డి, బాలకృష్ణ, పాండురంగారెడ్డి, రామ్‌రెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యులు మహమూద్‌, వివిధ కాలనీవాసులు తదితరులు ఉన్నారు.