– సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ
– పీఏసీఎస్ నూతన గోదాముల ప్రారంభం
నవతెలంగాణ-నేలకొండపల్లి
మండలంలో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆదివారం విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా మండలంలోని పైనంపల్లి, రామచంద్రపురం, నాచేపల్లి గ్రామాలలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నూతన గోదాములను, రైతు సేవా కేంద్రాలను ఆయన ప్రారంభించారు. పైనంపల్లి, రామచంద్రపురం పిఎసిఎస్ పరిధిలోని సుర్దేపల్లి గ్రామంలో 34.20 లక్షల రూపాయలతో నిర్మించిన గోదాముతో పాటు రైతు సేవ కేంద్రాలను ఎమ్మెల్యే కందాల ప్రారంభించారు. పైనంపల్లి పీఏసీఎస్ వారి సహకారంతో మంజూరైన వ్యవసాయ రుణాలను, ఇన్సూరెన్స్ చెక్కులను రైతులకు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదాముల నిర్మాణంతో రైతులకు సరిపడా ఎరువులను నిల్వ చేసుకునే సౌకర్యంతో పాటు అగ్రి అవుట్లేట్ల ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు లాభాలు చేకూర్చేందుకు ఉపయోగపడతాయన్నారు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గంగమ్మ తల్లి దేవాలయానికి ఆయన విరాళం అందజేశారు. నాచేపల్లి గ్రామంలో పిఎసిఎస్ నూతన గోదాముతో పాటు నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని చర్చికి ఆయన విరాళం అందజేశారు. మండలంలోని మంగాపురం చినతండాలో నూతనంగా నిర్మిస్తున్న మారెమ్మ తల్లి, సేవాలాల్ మహారాజు దేవాలయాలను సందర్శించి విరాళం అందజేశారు. రాయగూడెం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, ముజ్జుగూడెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి, చర్చి నిర్మాణానికి, నేలకొండపల్లి మండల కేంద్రంలో పెంతుకోస్తు చర్చి నిర్మాణానికి విరాళాలు అందజేశారు. గువ్వలగూడెం గ్రామంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు రామాలయ నిర్మాణానికి, పీర్ల చావిడి నిర్మాణానికి విరాళం అందజేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 13 మంది లబ్ధిదారులకు 6 లక్షల 82 వేల రూపాయల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. మండలంలోని రాయగూడెం, కోరట్లగూడెం గ్రామాలలో వివిధ పార్టీలకు చెందిన ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే కందాల పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నంబూరి శాంతకుమారి, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, సిడిసి చైర్మన్ నెల్లూరి లీలప్రసాద్, రైతుబంధు సమన్వయ సమితి మండల కన్వీనర్ శాఖమూరి సతీష్, సహకార సొసైటీ చైర్మన్ లు గూడవల్లి రామబ్రహ్మం, శ్రీనివాసరావు పాల్గొన్నారు.