భక్తరామదాసు పైప్‌లైన్‌ పనులకు ఎంఎల్‌ఏ శంకుస్థాపన

– 4,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు : ఎంఎల్‌ఏ కందాళ
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
మండలంలో సుమారు 4500 ఎకరాలకు భక్త రామదాసు పైప్‌ లైన్‌ ద్వారా సాగునీరు అందిం చేందుకు సుమారు కోటి 90 లక్షల 90 వేల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టేం దుకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌ రెడ్డి మండలం లోని బచ్చోడు తండా వద్ద పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. భక్త రామదాసు పైప్‌ లైన్‌ ద్వారా ఎస్‌.ఆర్‌.ఎస్‌.పి కాల్వకు అనుసంధానం చేసి 4500 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించేందుకు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి ప్రత్యేక పైప్‌ లైన్‌ ను నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఏ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మంగీలాల్‌, నీటిపారుదల శాఖ డిఈఈ బాణాల రమేష్‌ రెడ్డి, బచ్చోడు తండా సర్పంచ్‌ బిక్ష నాయక్‌, సోలిపురం సర్పంచ్‌ అలావత్‌ జ్యోతి శ్రీనివాస్‌, ఎంపీటీసీ పాపా నాయక్‌, పైనంపల్లి సర్పంచ్‌ బానోతు శ్రీను తదితరులు పాల్గొన్నారు.