మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎంఎల్ఏ సీతక్క. 

నవ తెలంగాణ-గోవిందరావుపేట: మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురి మృతుల కుటుంబాల సభ్యులను శుక్రవారం ఎమ్మెల్యే సీతక్క పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.
మండలంలోని లక్నవరం పంచాయతీ దుంపలగూడెం గ్రామానికి చెందిన బొబ్బ మల్లారెడ్డి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను సీతక్క పరామర్శించి ఓదార్చారు. అదేవిధంగా మండలంలోని రాంనగర్ పంచాయతీ ఎల్బీనగర్ గ్రామానికి చెందిన సనప రాజ్యలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను కూడా సీతక్క పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని అన్నారు.ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, మండల ఇంఛార్జి కొంపెల్లీ శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రసపుత్ సీతారాంనాయక్, మాజీ ఎంపీపీ, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి సూదిరెడ్డి జనార్ధన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, జంపాల చంద్రశేఖర్, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సూడి సత్తిరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు, కట్ల జనార్ధన్ రెడ్డి,  సామ హనుమంత రెడ్డి, బొల్లు కుమార్, అజ్మీరా సమ్మాలు, కందుల అశోక్, మూడ్ ప్రతాప్, లావుడియ రాజు తదితరులు పాల్గొన్నారు.