ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క..

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తిరెడ్డి కోడలు ఇటీవల రహదారి ప్రమాదంలో గాయపడగా గురువారం ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రామర్శించారు. ఈ సందర్భంగా సీతక్క ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, పసర కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉపసర్పంచ్ అయిన బద్దం లింగారెడ్డి, పంగ శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు.