
తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి బుధవారం కల్వకుంట్ల తారక రామారావు నిజామాబాద్ వచ్చిన సందర్భంగా ఎలి పాడ్ వద్ద రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మహేష్ బిగాల పుష్పగుచ్చం అందజేసి ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికారు. అలాగే ఆ ప్రాంతమంతా సంబరాన్ని అంటుకుంది పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.