వేద రజనికి శుభాకాంక్షలు తెల్పిన ఎమ్మెల్సీ

నవతెలంగాణ-తలకొండపల్లి
హైదరాబాద్‌ లో రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా వేద రజిని నాంపల్లిలోని రాష్ట్ర వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో గురువారం బాధ్య తలు స్వీకరించారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమెకు పూలగుచ్ఛం అందిం చి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సాయిచంద్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లక్ష్మీదేవి రఘురాములు బిఆర్‌ఎస్‌ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బాధితుడికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత
తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన ఎస్‌.సాయిలుకు హైదరాబాద్‌ లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి నివాసంలోని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ రూ.56వేల చెక్కును అందజేశారు.