ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డిని పదవి నుంచి తొలగించాలి

– క్షమాపణ చెప్పకపోతే తగిన బుద్ధి చెబుతాం
– ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో కౌశిక్‌ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ కొడంగల్‌
జర్నలిస్టును దుర్బాషలాడి అతని కెమెరా లాక్కుని అతనిపై దాడికి పాల్పడడమే కాకుండా ముదిరాజ్‌ కులాన్ని దుర్బాషలాడిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డిని వెంటనే ఎమ్మె ల్సీ పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి సస్పెండ్‌ చేయా లని ముదిరాజ్‌ యువజన సంఘం తాలూకా అధ్యక్షులు బాలరాజ్‌, కొడంగల్‌ మండల ముదిరాజ్‌ సంఘం అధ్య క్షులు వెంకటయ్య, ముదిరాజ్‌ సంఘం సీనియర్‌ నాయకు లు కూర వెంకటయ్యలు అన్నారు. కొడంగల్‌లోని ముది రాజ్‌ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్‌ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి ఎమ్మె ల్సీ పాడే కౌశిక్‌ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కౌశిక్‌ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. వారు మాట్లాడుతూ బాధ్యతయుతమైన పదవిలో ఉంటూ ఒక వీడియో జర్న లిస్టును కిడ్నాప్‌ చేసి అతని హింసించడం కులాన్ని అవ మానపరిచే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నా రు. సీఎం కేసీఆర్‌ ఈ విషయంలో స్పందించి వెంటనే కౌశి క్‌ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించి, పార్టీ నుండి సస్పెండ్‌ చేయాలన్నారు. ముదిరాజులు, పాడి కౌశిక్‌ రెడ్డిని ఎక్కడా తిరగనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించా రు. ముదిరాజులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్‌ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. కార్యక్రమంలో కౌటి బం దప్ప, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కిష్టప్ప, కార్య దర్శి కురుమయ్య ముదిరాజ్‌ సంఘం నాయకులు తదిత రులు పాల్గొన్నారు.