జోరుగా ఎమ్మెలే హన్మంత్ షిండే ప్రచారం

నవతెలంగాణ – జుక్కల్: మండలంలోని చిన్న ఎడ్గి జీపీ గ్రామములో ఎమ్మెలే హన్మంత్ షిండే ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. స్థానిక బాష మరాఠీలో మాట్లాడిన ఎమ్మెలే గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గోన్నారు. ఎన్వికల ప్రచారంలో భాగంగా 37 మందికి కళ్యాణ లక్ష్మీ , 48 మందికి కంటివెలుగు , 3వందల 4మందికి రైతు బంధు, 81 కేసిఆర్ కిట్ అందించామని, ప్రస్తుతం ఎన్నికలో గెలిచిన అనంతరం మెనిఫెస్టో ప్రకారం ప్రజలకు హమీలను అందిస్తామని, ఎన్నికలలో గెలిపించి మరోసారీ అశ్విరదించాలని ఓటర్లకు విఙ్ఞప్తి చేసారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శాలీని బాయి పటేల్, బీఆర్ఎస్ నాయకులు నీలు పటేల్ , సాయాగౌడ్ , సదుపటేల్, గజిరే రాజు, రాజశేఖర్ పటేల్, సర్పంచులు కపిల్ పటేల్ , రవిపటేల్, రాములు, గ్రామప్రజలు తదితరులు పాల్గోన్నారు.