నవతెలంగాణ – జుక్కల్: అక్టోబర్ 30వ తేదిన జుక్కల్ మండలానికి అసెంబ్లి ఎన్నికల ప్రచారమలో భాగంగా సంధర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్ రావు ప్రచారం కోరకు విచ్చేయుచున్నారు. సంధర్భంగా శుక్రవారం నాడు జుక్కల్ ఎమ్మెలే హన్మంత్ షిండే జుక్కల్ చౌరస్తా వద్ద ఏర్పాట్ల పనులను సభాస్థలిని, హెలిప్యాడ్ స్థలం, పార్కింగ్, ఏర్పాట్లను కౌలాస్ సర్పంచ్ గొల్ల హన్మండ్లు, కేమ్రాజ్ కల్లాలీ మాజీ సర్పంచ్ సుంకరి వెంకటి, యువనాయకుడు హరిష్ షిండే తో కలిసి పరీశీలించారు. కార్యక్రమంలో ఆర్& బీ సూపర్ వైజర్ బాలకృష్ణ , బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.