
నవతెలంగాణ – జుక్కల్
మాదిగ సమాజిక వర్గానికి చెందిన వారికి జుక్కల్ ఎమ్నెలే టికేట్ కేటాయించాలని విద్యావంతుడు, సమాజీక సేవకుడు, హెడ్మాస్టర్ సీతయ్య అన్నారు. గురువారం రోజు జుక్కల్ మండల కేంద్రంలో మాదిగ సమాజిక వర్గాల మేదావులు, యువకులు, మాదిగ దమడోరా ఆధ్వర్యంలో కలిసి విదులలో భజాభజంత్రిలతో మాదిగల బలప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్భంగా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లి ఎమ్మెలే టికేట్ ఆశీస్తున్న సీతయ్య మాట్లాడుతు ముందుగా భారత రాజ్యంగ నిర్మాత బిఆర్ అంబేడ్కర్ విగ్రహనికి పూల మాల నివాళ్లు అర్పించి ర్యాలీ ప్రారంబించామని అన్నారు , జుక్కల్ నియేాజక వర్గంలో స్థానిక పెద్దల సహకారంతో పదహేను లక్షల రూపాయలతో ప్రభూత్వ పాఠశాలలకు సామాగ్రిని అందించామని పేర్కోన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు వాలీబాల్, క్రికెట్ కిట్లు అందించడం జర్గిందన్నారు.అంతేకాకుండా ఉచిత ఆరోగ్యశిభిరాలను ఏర్పాటు చేసామన్నారు. ఉన్నత విద్యను అబ్యసించెందుకు ఎమ్మెలేగా ఆవకాశం ఇవ్వాలన్నారు. జుక్కల్ నియేాజక వర్గంలో ఇప్పడివరకు టీడిపీ, తెరాస పార్టీలో మాల సమాజిక వర్గానిక ఆవకాశం కల్పిస్తె, మాదిగ సమాజిక వర్గానిక ఒక సారీ మాత్రమే అవకాశం వచ్చిందన్నారు. ఈ సారి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెలే అబ్యర్థిగా జనాభా అధికంగా ఉన్న మాదిగలకు టికేట్ కేటాయించాలని, న్యాయమైన అబ్యర్థనను ముఖ్యమంత్రి కేసిఆర్ గుర్తించాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు దత్తు, రాములు , హన్మంత్ తదితరులు పాల్గోన్నారు.