అనుమానాస్పద స్థితిలో తల్లీకూతురు ఆత్మహత్య

రాయదుర్గంలో ఘటన
నవతెలంగాణ-మియాపూర్‌
అనుమానాస్పద స్థితిలో తల్లీకూతురు ఉరేసు కుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ ఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. రాయదుర్గం సీఐ మహేష్‌ తెలిపిన వివరాల ప్రకారం బుడ్డోలు అలివేలు(40) కూతురు లాస్య (14) మణికొండ ప్రాంతంలోని ఆంధ్ర బ్యాంక్‌ పక్కన నివసించే వారు. అయితే రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న పాత బట్టలు అన్నింటిని తగలబెట్టి, మొదటగా కూతురు, ఆ తర్వాత తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం చిన్న కొడుకు మణికంఠ బట్టలు ఎందుకు తగలబెడుతున్నారని ప్రశ్నించగా నీకేమీ తెలియదు పో అంటూ బయటికి పంపించారు. భర్తకు కూడా రూ.5 వేలు ఇచ్చి యాదగిరిగుట్టకు వెళ్లమని అలివేలు చెప్పింది. తల్లి,అక్క ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను చూసిన చిన్న అబ్బాయి పోలీసులకు సమాచారం ఇవ్వగా, వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మెరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.