వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

tandoor dsp1 copy– ఆటో డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలను నడపాలి
– తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్‌
నవతెలంగాణ-తాండూరు
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధ నలు పాటించాలని తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఆటో డ్రైవర్లకు, వివిధ పాఠశాల స్కూల్‌ బస్సుల డ్రైవర్లకు, విద్యార్థులకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మా ట్లాడుతూ.. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా వాహనాన్ని ఫిట్నెస్‌గా ఉంచుకోవాల న్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ వాహనానికి సంబంధించిన అన్ని రకాల సర్టిఫికెట్లను ఉంచాల న్నారు. కాలం చెల్లిన వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు కూడా రోడ్లపై నడిచేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌స్పెక్టర్‌ జోసఫ్‌, తాండూరు పట్టణ ఎస్‌ఐ అబ్దుల్‌రావు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, వివిధ పాఠశాలల డ్రైవర్లు పాల్గొన్నారు.