– ఎమ్మెల్సీ పాడి కౌశీక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ – బెజ్జంకి
యూట్యూభ్ చానల్ యందు పనిచేస్తున్న ముధిరాజ్ వర్గం యువకుడిపై తన అనుచరులతో దాడి చేయించి అసభ్యపదజాలంతో దూషించిన ఎమ్మెల్సీ పాడి కౌశీక్ రెడ్డిపై మండలంలోని ముధిరాజ్ వర్గాల ప్రజలు అగ్రహం వ్యక్తం చేశారు.శనివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ మాజీ యువజన మండలాధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్ అద్వర్యంలో ఎమ్మెల్సీ పాడి కౌశీక్ రెడ్డి అసభ్యకర వాఖ్యలను ఖండిస్తూ అయన దిష్టిబొమ్మను దహనం చేశారు.ముధిరాజ్ వర్గాలపై చేసిన అసభ్యకర వాఖ్యలకు ఎమ్మెల్సీ కౌశీక్ రెడ్డి బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని లేనిపక్షంలో రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని గూడెల్లి శ్రీకాంత్ హెచ్చరించారు.కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి, నాయకులు బోనగిరి రాజేందర్, రొడ్డ మల్లేశం,మైల ప్రభాకర్,డీవీ రావు,గూడెల్లి ఐలయ్య,బోనాల ఐలయ్య,బండిపెల్లి రాజు,రంగోని రాజు తదితరులు పాల్గొన్నారు.