ఎమ్మెల్సీలుగా ముదిరాజ్‌లకు అవకాశమివ్వాలి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎమ్మెల్సీలుగా ముదిరాజ్‌లకు అవకాశమివ్వాలని ముదిరాజ్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. గవర్నర్‌ కోటాలో ఈనెల 27వ తేదీన ఖాళీ అవుతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలు తమ సామాజిక వర్గానికి కేటాయించి న్యాయం చేయాలని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.