బండారు తులసి స్మారకార్థం ముగ్గుల పోటీలు

నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
భద్రాచలం పట్టణంలోని 4వ వార్డు పరిధిలో బండారు తులసి స్మారక ఏడవ సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో వైభవంగా జరిగాయి. ఈ పోటీలలో ముగ్గులు వేసి గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రముఖ వైద్యురాలు సరోజినీ, క్రాంతి విద్యాలయం కరస్పాండెంట్‌ సోమ రౌతు, సమతా ప్రముఖ న్యాయవాది కే శుభశ్రీ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో ముందుకు సాగాలని కోరారు. సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైనదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలను, విజేతలుగా గెలుపొందిన వారికి వారు అభినందనలు తెలియజేశారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కే.లక్ష్మి, ఏ.వినిలా రాణి, పి.సునీత వ్యవహరించారు. మొదటి బహుమతి తేజస్వి, హేమ, మూడవ బహుమతి శ్వేతా గెలుచుకున్నారు. వీరితోపాటు మరో నాలుగు స్పెషల్‌ ప్రైజులు, మరో 10 కన్సోలేషన్‌ బహుమతులు, పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతి నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి మాజీ వార్డు మెంబర్‌ బండారు శరత్‌ బాబు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు గాదే మాధవరెడ్డి, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, డి.లక్ష్మి, జి.జీవనజ్యోతి, ఎం.సుబ్బలక్ష్మి తోపాటు బండారు సరస్వతి, చంద్రలేఖ, జి.పద్మావతి, సిహెచ్‌ విశాల, కే.స్వరూప, సిహెచ్‌ మంజుల, పి.ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.