మున్నూరు కాపులకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి

–  కరీంనగర్‌ నుంచి కొనగాలకు టికెట్‌ ఇవ్వాలి
–  తెలంగాణ మున్నూరు కాపు ప్లీనరీ తీర్మానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మున్నూరు కాపులకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని మున్నూరు కాపు ప్లీనరీ తీర్మానించింది. అలా ఎక్కువ సీట్లు కేటాయించిన రాజకీయ పార్టీకే మద్ధతిస్తామని స్పష్టం చేసింది. మున్నూరు కాపు అభ్యర్థులను గెలిపించుకునేందుకు పార్టీలకు అతీతంగా కృషి చేస్తామని తెలిపింది. అదే ప్లీనరీలో కరీంనగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు కొనగాల మహేశ్‌కు సీటివ్వాలని కాంగ్రెస్‌ పార్టీని కోరుతూ తీర్మానించింది. ఈ సందర్భంగా మున్నూరు కాపు రాష్ట్ర నాయకుడు కాసారం రమేశ్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మున్నూరు కాపులకు అన్ని పార్టీలు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.