బీసీలు రాజ్యాదికారం దిశగా ఉద్యమించాలి: మురళీకృష్ణ

నవతెలంగాణ-మంగపేట
తెలంగాణ రాష్ట్రంలోని బీసీలు రాజ్యాదికారమే లక్ష్యంగా ఉద్యమించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షుడు బట్ట మురళీకృష్ణ పిలుపునిచ్చారు. మగళవారం సాయంత్రం మండల కేంద్రంలోని శ్రీఉమాచంద్రశేఖరస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బీసీ సన్నాహక సమావేశం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షులు ఆళ్ళ రాణి, మండల ఇంచార్జ్ గాదే శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిధిగా మురళీకృష్ణ పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ కులాలకు పురిటి గడ్డగా ఉన్నప్పటికీ అగ్రకులాలకు చెందిన రాజకీయ నాయకులు రాజ్యాధికారంలో ఉండడంతో బీసీలు అనగదొక్క బడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు రాజ్యాధికారం కోసం పోరాడే సమయం ఆసన్నమైందని వచ్చే సాదారణ ఎన్నికల్లో ‘ఓటు మనదే సీటు మనదే’ అనే నినాదంతో ఉద్యమించినప్పుడే బీసీలకు మెజార్టీ వాటా సీట్లు దక్కుతాయని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీసీ కులాలు ఏకధాటిగా పోరాడాల్పిన అవసరం ఉందని ములుగు జిల్లాలోని 9 మండలాల బీసీలంతా రాజకీయాలకు అతీతంగా ఏకమై ఎన్నికల్లో తమ సత్తా చాటాలని పిలపునిచ్చారు. వచ్చే నెల 8న వేలాది మందితో చలో ఢిల్లీ పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో మంచర్ల నాగేశ్వరరావు, బక్కి నవీన్, మాటూరి ఏడుకొండలు, తుమ్మల మల్లేష్, తోటకూరి శ్రీకాంత్ గౌడ్, పంపన పార్వతి, కొమరగిరి కోదండం, చిప్ప వెంకటేశ్వర్లు, పాశికంటి యాదగిరి, గుండు సరోజన, నిర్మల, దాగం శ్యామ్, పంపన సంతోష్, చింతల ఝాన్సీ, సృజన తదితరులు పాల్గొన్నారు.