మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ షురూ..

నితిన్‌, రష్మిక మందన, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ మంగళవారం చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సంగీత దర్శకుడు జివి ప్రకాష్‌ కుమార్‌, రైటర్‌ శ్యామ్‌ కాసర్లతో చిత్ర బృందం సంగీత చర్చలను ఆరంభించింది.
ఈ చిత్రంలో నితిన్‌ స్టైలిష్‌ అవతార్‌లో కనిపిస్తుండగా, రష్మిక మందన అల్ట్రా-మోడరన్‌ లుక్‌లో స్క్రీన్‌పై మెరవనుంది. నితిన్‌, రష్మిక పుట్టినరోజుల సందర్భంగా మేకర్స్‌ విడుదల చేసిన పోస్టర్లకు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది.
నితిన్‌, రష్మిక, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వచ్చిన ‘భీష్మ’ పెద్ద విజయాన్ని సాధించింది. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. సరికొత్త కాన్సెప్ట్‌తో, సరికొత్త విజువల్‌ ప్రజెంటేషన్‌తో ఈచిత్రాన్ని మేకర్స్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. నవీన్‌ యెర్నేని, వై. రవి శంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలను పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: వెంకీ కుడుముల, సీఈవో : చెర్రీ, సంగీతం: జివి ప్రకాష్‌ కుమార్‌, డీవోపీ: సాయి శ్రీరామ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌ కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: హరి తుమ్మల, లైన్‌ ప్రొడ్యూసర్‌: కిరణ్‌ బళ్లపల్లి.