పట్నం మహేందర్‌ రెడ్డి అనే నేను..

My name is Patnam Mahender Reddy..– రాజ్‌భవన్‌లో క్యాబినెట్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం
– గవర్నర్‌ తమిళిసైతో సీఎం కేసీఆర్‌ సంభాషణ
– భూగర్భ గనులు, సమాచార శాఖ అప్పగింత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పట్నం మహేందర్‌రెడ్డి రాష్ట్ర క్యాబినెట్‌ మినిస్టర్‌గా గురువారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై ఆధ్వర్యంలో గురువారం ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం గవర్నర్‌ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. గవర్నర్‌తో కలిసి తన మంత్రి మండలి సభ్యులందరితో గ్రూపు ఫోటో సెషన్‌లో ఆయన పాల్గొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహేందర్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మెన్లు, తదితర ప్రజాప్రతిని ధులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. మహేందర్‌రెడ్డి భూగర్భ గనులు, సమాచార శాఖను సీఎం కేసీఆర్‌ కేటాయించారు. పదేండ్ల కాలంలో మొదటి సమాచార శాఖ మంత్రి ఆయనే కావడం గమనార్హం.