నా ఓటు బాల్క సుమన్ కె

నవతెలంగాణ-రామకృష్ణాపూర్ :  చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని రామకృష్ణాపూర్ గద్దెరాగడికి చెందిన జింక రమేష్ చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పై అభిమానంతో  కారు గుర్తుకే ఓటేస్తామని వారి ఇంటి ముందు ఫ్లెక్సీ వేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గాన్ని గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేసిన బాల్క సుమన్ కు తమ కుటుంబం మొత్తం ఈ ఎన్నికల్లో ఓటేస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎవరూ తమ ఇంటికి ఓట్ల కోసం రావద్దని అన్నారు.