నీట్‌ ఫలితాల్లో నారాయణ విజయ పరంపర!

హైదరాబాద్‌ : వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ -2023లో తమ విద్యార్థులు విజయ పరంపరను కొనసాగించారని నారాయణ గ్రూప్‌ డైరెక్టర్స్‌ పి సింధూర నారాయణ, పి శరణి నారాయణ తెలిపారు. ఆలిండియా 10 లోపు 4 ర్యాంక్‌లు, 100 లోపు 35 ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. శశాంక్‌ సిన్హా అలిండియా 4వ ర్యాంక్‌తో సంచలనం సృష్టించారన్నారు. తమ విద్యార్థులు 500 లోపు 112, 1000 లోపు 169 ర్యాంక్‌లు పొంది సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పారన్నారు. విశిష్టమైన ప్రణాళికతో రూపొందించిన స్టార్‌ సిఒ బ్యాచ్‌, ఎన్‌ 40 ప్రోగ్రామ్‌ ద్వారా నిరంతరం టాప్‌ ర్యాంక్‌లు సాధిస్తున్నామన్నారు. సిబిఎస్‌ఇ సిలబస్‌ ఆధారంగా నిర్వహిస్తున్న నీట్‌ పరీక్ష కోసం అత్యంత వినూత్న విద్యా ప్రణాళిక వలనే ఈ టాప్‌ ర్యాంకులు సాధించగలిగామన్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి వారు అభినందనలు తెలిపారు.