జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో నారాయణ రికార్డ్‌..!

హైదరాబాద్‌ : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2023లో బాలికల విభాగంలో ఆలిండియా 1వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నట్లు నారాయణ గ్రూప్‌ వెల్లడించింది. తమ విద్యార్థిని ఎన్‌ నాగభవ్యశ్రీ ఆలిండియా ఫస్ట్‌ ర్యాంక్‌ను సాధించిందని తెలిపింది. ఆలిండియా టాప్‌ 20లో 5 ర్యాంక్‌లు పొందామని నారాయణ గ్రూప్‌ డైరెక్టర్స్‌ పి సిందూర నారాయణ, పి శరణి నారాయణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓపెన్‌ కేటగిరీలో 100లోపు 29 ర్యాంక్‌లతో తమ సంస్థ లీడర్‌గా నిలిచిందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఈ పరీక్షకు 1.80 లక్షల మంది పోటీపడగా.. నారాయణ విద్యార్థులు విజయదుందుభి మోగించారని తెలిపారు. అన్ని కేటగిరీల్లో 11 లోపు 15 ర్యాంక్‌లు సాధించినట్లు వెల్లడించారు. జాతీయ స్థాయిలో నిర్వహించబడే జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ పరీక్ష విధానం, ఆన్‌లైన్‌ ప్రక్రియలో నిర్వహించినప్పటికీ నారాయణ వినూత్నంగా రూపొందించిన ప్రణాళిక, వారాంతపు టాపిక్‌వైజ్‌ ప్రోగ్రామ్‌లు, ఆన్‌లైన్‌కు అనుకూలంగా రూపొందించిన స్టడీ మెటీరియల్‌ వల్లే తమ విద్యార్థులు మెరుగైన ప్రగతిని కనబర్చారని తెలిపారు. మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా మైక్రోషెడ్యూల్డ్స్‌, వీక్లీ టెస్ట్‌ల నిర్వహణలో నిరంతరం మార్పులు చేసుకుంటూ ఇంతటి ఘన విజయాన్ని సాధించామని సింధూర నారాయణ, శరణి నారాయణ తెలిపారు. అద్బుత ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి వారు అభినందనలు తెలిపారు.