![ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఏర్పుల నరోత్తమ్](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/sc-corporation.jpeg)
నరోత్తమ్ రాజకీయ ప్రస్థానమిదీ..
ఏర్పుల నరోత్తమ్ జహీరాబాద్‌లోని పస్తాపూర్‌లో 1965, ఏప్రిల్ 19వ తేదీన చంద్రమ్మ, నర్సయ్య దంపతులకు మూడో సంతానంగా జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1987 సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటి పారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కాలువల డిజైన్లలో ఆయన కీలకపాత్ర పోషించారు. అనంతరం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ప్రమోషన్ పొందారు. సింగూరు ప్రాజెక్టు గేట్ల ఇంచార్జిగా వ్యవహరించారు. వికారాబాద్‌లో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇంచార్జిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో 2008లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల బాట పట్టారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఏడాది జులై 6న బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.