10న జాతీయ లోక్‌ అదాలత్‌

– ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
– వికారాబాద్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సుదర్శన్‌
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
ఈ నెల 10న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను ప్రజలు సద్వినియో గం చేసుకోవాలని వికారాబాద్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సుదర్శన్‌ సూచించారు. శనివారం వికారాబాద్‌ జిల్లా కోర్ట్‌ ఆవరణలో జిల్లా పోలీసుల తో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10న నిర్వహించనున్న జాతీయ లోకదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు రాజీ పడే విధంగా చూడాలని న్యాయమూర్తి పోలీసు అధి కారులకు సూచించారు. ఇందులో భార్య భర్తల కేసులు, కుటుంబ తగాదాల కేసులు, మోటార్‌ వెహికల్‌ ప్రమాద కేసులు బ్యాంకుల్లో అప్పు తీసుకుని అవికట్టక వడ్డీపేరుకుపోయిన వాటిని కూడా ఇందులో రాజీ కుుదుర్చుకో వచ్చున్నారు. అదేవిధంగా తెలిసితెలియక చేసిన చిన్నచిన్న తప్పుల వల్ల కేసులు నమోదయి కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ సమయాన్ని వృథా చేసు కుంటున్నామని అనుకుంటున్న వారికి కూడా తమతప్పును ఒప్పుకున్నట్లయితే వారికి జరిమానా విధిస్తామని తెలిపారు. అది చెల్లించినట్లయితే అట్టి వారి కేసులు తొలగిస్తామని తెలిపారు. ఆబ్కారీ శాఖలో కూడా రాజీ పడదగ్గ కేసులను కూడా లోకదాలత్‌ ద్వారా రాజీ పడినట్లయితే కేసులను పరిష్కరిస్తా మన్నారు. కేసులు పరిష్కారం కోసం రాజీ చేసుకోవాలేనుకొని ఎదురు చూస్తు న్న వారికి ఇది ఒక చక్కటి అవకాశమని, జిల్లలో అధిక సంఖ్యలో కేసులను రాజీపడే విధంగా చూడాలని పోలీసు అధికారులకు తెలియజేశారు. ఈ కార్య క్రమంలో ఒకటవ అదనపు న్యాయమూర్తి చంద్రకిషోర్‌, ప్రిన్సిపాల్‌ జూనియర్‌ న్యాయమూర్తి కె.శ్రీకాంత్‌, అదనపు జూనియర్‌ న్యాయమూర్తి శృతి దూత, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ రాజేశ్వర్‌, అన్వేష్‌ సింగ్‌, సమీన బేగం, వికారాబాద్‌ జిల్లా అడిషనల్‌ ఎస్పీ మురళీధర్‌, జిల్లా ఆబ్కారీ సుపరింటెండెంట్‌ డాక్టర్‌ నవీన్‌చంద్ర, వికారాబాద్‌ డీఎస్పీ బివి సత్యనారాయణ, సీఐలు, ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.