వర్షాకాలం అంటేనే మొక్కలు పెంచే కాలం. ఎంత వర్షాకాలమైన మొక్కలు సరిగ్గా పెరగాలంటే వాటికి ఎరువులు అవసరం. వాటిని ఇంట్లోనే చేసుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో చూద్దాం…
యాపిల్ తొక్కలతో: యాపిల్స్‌ని చాలా మంది ఇష్టంగా తింటారు. వాటిని తినేటప్పుడు కొంతమంది తొక్కని తీసిపారేస్తుంటారు. వాటిని అలా పారేసే బదులు చెట్లకి వేయాలి. మొక్కలు పెరగడానికి ఇవి చాలా సాయపడతాయి. కాబట్టి యాపిల్ తొక్కలను వేస్ట్‌గా పారేయొద్దు.
సోయా: సోయా బీన్స్‌ని చాలా మంది నానబెడుతుంటారు. ఆ నీటిని పారేస్తుంటారు. అలా కాకుండా వీటిని చెట్లకి పోయడం వల్ల చెట్లు ఏపుగా పెరుగుతాయి.
పండ్ల తొక్కలు: చాలా మంది అరటిపండ్లు తొక్కలు పారేస్తుంటారు. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని చెట్లకి వేయడం వల్ల ఎరువులా పనిచేస్తాయి.
బియ్యం కడిగిన నీరు: సాధారణంగా అందరూ ఈ నీరు కూడా పారబోస్తుంటారు. అలా కాకుండా వీటిని కూడా చెట్లకి పోయడం అలవాటు చేసుకోండి. ఈ నీరు చెట్ల మూలాలకి మంచి బలాన్ని ఇస్తాయి. వీటి వల్ల చెట్లు బలంగా పెరుగుతాయి.
గుడ్లసొన: గుడ్లు పై పొట్టు కూడా చెట్లకి చాలా మంచిది. దీనిని కూడా చెట్లకి వాడడం వల్ల చెట్లు బలంగా, ఏపుగా పెరుగతాయి. వేస్ట్‌గా పారేసే ఈ పెంకులు చెట్లకి బలమన్నిస్తాయని గుర్తుంచుకోండి.
వాడేసిన కాఫీ, టీ పొడి: ఈ పౌడర్స్‌ని కూడా చాలా మంది పనికి రావని పారేస్తుంటారు. కానీ ఈ సారి నుంచి వీటిని చెట్లకి వేయండి. వీటిలోని సారం చెట్ల వేర్లకి బలమని ఎంత మందికి తెలుసు. వీటి వల్ల చెట్లకి సహజ ఎరువుని వేసినవారు అవుతారు.
ఇలాంటి కొన్ని టిప్స్‌ని పాటించడం వల్ల ఇంట్లోనే చక్కని ఎరువులని తయారు చేసుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. ఉల్లిగడ్డ పొట్టు, కూరగాయల వ్యర్థాలు, అన్నింటిని స్టోర్ చేసి వాటిని కూడా ఎరువుల్లా వాడొచ్చు. వీటితో చెట్లని పెంచుకోవచ్చు. వీటి ద్వారా కెమికల్స్ లేని సహజ ఎరువులని మీ మొక్కలకు వాడొచ్చు. వీటివల్ల ఎలాంటి నష్టం ఉండదు. చెట్లు ఏపుగా పెరగాలంటే ఇలాంటి సహజ సిద్ధమైన ఎరువులు ఎంతో ఉపయోగపడతాయి. చెట్లు ఏపుగా పెరగాలంటే వీటితో పాటు ఎప్పటికప్పుడు ఆ చెట్ల వ్యర్థాలను క్లీన్ చేయాలి. దీని వల్ల అవి చూడ్డానికి కూడా బావుంటాయి. అదే విధంగా వాటికి సరిపడా నీరు పోయాలి.