జుక్కల్ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు నీటీ సమస్య

– ఎస్ఎఫ్ఐ  ఆధ్వర్యంలో  ఎంఈవో  అధికారికి  వినతిపత్రం.

నవతెలంగాణ- జుక్కల్: మండల  కేంద్రంలోని  జిల్లా పరిషత్  పాఠశాలలో  విద్యార్థులకు గత  కొన్ని రోజులుగా త్రాగునీరు, తిన్న ప్లేట్లు కడుక్కోవాడానికి విధులలో ఉండే జీపి నల్లాల వద్దకు వెళ్లడం జర్గుతుందని,  సమస్య చాలా రోజులుగా  పరిష్కరించక పోవడంతో  విద్యార్థులకు  మద్యహన బోజనం  అనంతరం  ప్లేట్లు పట్టుకుని  బయటికి   వెళ్లడం అవనమానంగా  విద్యర్థులు  బావిస్తున్నారని, మస్యను పరి ష్కరించాలని కోరుతు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో  బుదువారం నాడు జుక్కల్ ఎంఈవో అందుబాటులో లేకపోవడంతో  కార్యాలయ సిబ్బందికి డిమాండ్ తో కూడీన వినతి పత్రం అందించారు. నీటీ సమస్యతీర్చని ఎడల  ఉద్యమం చేస్తామని ఎస్ఎఫ్ఐ మండల శాఖ  అద్యక్షుడు అఫ్రోజ్  వినతి పత్రంలో  పేర్కోన్నారు.  కార్యక్రమంలో  ఎస్ఎఫ్ఐ మండల నాయకులు షేక్ ఫిర్దోస్ తదితరులు పాల్గోన్నారు.