ప్రభుత్వ భూములు కాపాడడంలో అధికారుల నిర్లక్ష్యం

– మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్‌
– పెద్ద షాపూర్‌ తండాలో ప్రభుత్వ భూములు అన్యా క్రాంతం
– చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు
నవతెలంగాణ-శంషాబాద్‌
ప్రభుత్వ భూములు కాపాడడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం కారణంగా కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అక్రమార్కులు పెద్ద ఎత్తున ఆక్రమించుకుని దర్జాగా ప్రీ కాస్ట్‌ నిర్మాణాలు చేస్తున్నారని శంషాబాద్‌ మాజీ ఎంపీపీ, పెద్ద షాపూర్‌ ఎం పీటీసీ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్‌ ఆందోళన వ్యక్తం చేశా రు. శుక్రవారం శంషాబాద్‌ మండలం పెద్ద షాపూర్‌ తండా గ్రామంలోని సర్వే నెంబర్‌ 220 భూములు అన్యాక్రాం తంలో అధికారుల పాత్రపై శంషాబాద్‌ తహసీల్దార్‌, రంగారెడ్డి జిల్లా సీసీఎల్‌ఏ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శంషాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ భూమిని కాపాడడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వ్యాపారులకు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద షాపూర్‌ తండా గ్రామ సర్వేనెంబర్‌ 220లో 105 ఎకరాల భూమి ఉందని అందులో 40 ఎకరాలు స్వాతంత్ర సమరయోధుల కు గతంలో ఇచ్చినట్టు తెలిపారు. మిగతా 65 ఎకరాల భూమిని స్థానిక బడుగు, బలహీన వర్గాలకు అసైన్డ్‌ చేశా రని అన్నారు. అసైన్డ్‌ చేసుకున్న ఈ భూములను కొంత మంది ప్రయివేటు వ్యక్తులకు అమ్ముకున్నారని ఆరోపించా రు. ఈ విషయం పై 2006 సంవత్సరంలో రంగారెడ్డి జి ల్లా అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ రజ్వి, శంషాబాద్‌ తహసీల్దార్‌ జె.మధు చేపట్టిన చర్యల ఫలితంగా అమ్ముకున్న అసైన్డ్‌ భూములను పీఓటి కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దని తెలిపారు. అయితే తర్వాత కాలంలో సర్వేనెంబర్‌ 220లో పీఓటీ కింద సేకరించిన భూములలో 600 కు టుంబాలకు ఇండ్ల స్థలాలు ఇచ్చారన్నారు. మిగతా పది ఎక రాల భూమిని కాపాడడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిం చారని తెలిపారు. 10 ఎకరాల భూమిలో పట్టాదారు పాస్‌ పుస్తకాలు, ప్రోసిడింగ్‌ ఆర్డర్‌, ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్నాయని కొంతమంది వ్యక్తులు పీఓటీ భూముల్లో ప్రీ కాస్ట్‌ ప్రహరీ నిర్మాణాలు చేసి ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. ప్రీ కాస్ట్‌ నిర్మాణాలను వెంటనే అడ్డుకొని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇంత పెద్ద ఎత్తున భూములు అన్యాక్రాంతం కావడంలో అధికారుల పాత్ర పైన కూడా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద షాపూర్‌ మాజీ సర్పంచ్‌ ఎస్‌.ఇస్రానాయక్‌, మాజీ ఎంపీటీసీ గోపాల్‌నాయక్‌, కాంగ్రెస్‌ పెద్దషాపూర్‌ తండా అధ్యక్షులు ఎస్‌.రవినాయక్‌, భగత్‌, శీను, బాలునాయక్‌, తదితరులు పాల్గొన్నారు.