సరికొత్త లవ్‌, యాక్షన్‌ డ్రామా..

కిరణ్‌ అబ్బవరం హీరోగా శివం సెల్యులాయిడ్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం:2గా ఒక సరికొత్త లవ్‌ యాక్షన్‌ డ్రామా రూపొందనుంది. ఈ చిత్రం ద్వారా విశ్వకరుణ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం గురువారం రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. హీరోపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్‌ క్లాప్‌ కొట్టగా, నిర్మాతలు సురేష్‌ బాబు, ఎ.ఎం.రత్నం కెమెరా స్విచాన్‌ చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు కె.ఎస్‌.రామారావు, జెమిని కిరణ్‌, శిరీష్‌, వల్లభనేని వంశీ, నల్లమలపు బుజ్జి, రామ్‌ తాళ్లూరి, దామోదరప్రసాద్‌, కె.కె. రాధామోహన్‌, బెక్కెం వేణుగోపాల్‌, ప్రసన్న కుమార్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు అతిథులుగా హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ నెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రానికి నిర్మాతలు: రవి, జోజో జోస్‌, రాకేష్‌ రెడ్డి, సహ నిర్మాతలు: బి.సురేష్‌ రెడ్డి, సంతోష్‌, సంగీతం: సామ్‌ సిఎస్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రవీందర్‌, డీఓపీ: విశ్వాస్‌ డానియేల్‌, ఎడిటర్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌.