నవతెలంగాణ-శేరిలింగంపల్లి
హైదరాబాద్‌లో అత్యంత భారీ రూఫ్ టాప్ బార్, రెస్టారెంట్ అయిన బ్రూస్టర్స్ బార్ అండ్ లడ్డు కిచెన్ గార్డెన్, యుఎస్ కాన్సులేట్ హైదరాబాద్ సమీపంలో బుధవారం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ప్రారంభించినట్టు నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ ఆహార అభిమా నులతో సహా తమ అభిమానులందరికీ అద్భుతమైన అనుభవానికి హామీనిస్తుంది. బ్రూస్టర్స్ రెండు విభిన్న టోన్స్, లక్షణాలను అందిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ నిరంతరం పెరుగుతున్న మెనూతో సందడిగా ఉండే క్యాంటినాను ప్రదర్శిస్తుంది, అభివృద్ధి చెందుతున్న ప్రాంతీయ ప్రపంచ భోజన అనుభవాన్ని ఇక్కడ అందిస్తారు. ఈ ప్రారంభం సందర్భంగా బ్రూస్టర్స్ బార్ అండ్ కిచెన్ ప్రమోటర్లు మాట్లాడుతూ ‘బ్రూస్టర్స్ బార్ కిచెన్ గార్డెన్‌ను పరిపూర్ణమైన డైనింగ్ డెస్టినేషన్‌ను రూపొందించడమే తమ లక్ష్యమన్నారు. బిజినెస్ ఆపరేషన్ డైరెక్టర్ రూపేష్ సాగర్ మాట్లాడుతూ, అతిధుల అనుభవాన్ని మెరుగుపరచడానికి బ్రూస్టర్స్ త్వరలో తన సొంత బ్రూవరీని ప్రారంభిస్తుందని, ఇది బీర్ ప్రియులు, ఔత్సాహికులకు ఒక గేమ్ ఛేంజర్‌గా ఉంటుందని వాగ్దానం చేయడమేకాక, హైదరాబాద్ నగర వాసులకు అస మానమైన బ్రూయింగ్ అనుభవాన్ని అందిస్తుందన్నారు. బ్రూస్టర్స్ మిక్సాలజిస్ట్స్ సాయిరామ్ గౌడ్, చైతన్య అధికారి మాట్లాడుతూ మా అద్భుతమైన బార్, క్రాఫ్ట్ బీర్లు, హెడీ కాక్‌టెయిల్ వంటి విస్తత శ్రేణి బీర్ కాక్‌టెయిల్స్, మార్గరీటాస్, స్పిరిట్స్ అతి పెద్ద సేకరణ, తాజాగా తయారుచేసిన ఆల్కహాల్ రహిత పానీయాలను అంది స్తుందన్నారు. హిడెన్ జెమ్, సిన్నమోన్ స్మోక్డ్ బోర్బన్ కాక్‌టైల్ – అప్ ఇన్ స్మోక్, ది డబుల్ వామ్మీ, జెంటిల్ పంచ్, పికిల్ టికిల్, టామరిండో, మరిన్ని వంటి సిగేచర్ కాక్‌టెయిల్‌ల శ్రేణి నుంచి ఎంచుకోవచ్చని అన్నారు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో సరికొత్త రిట్రీట్ బ్రుస్టర్స్ బార్ అండ్ కిచెన్ గార్డెన్ ప్రారంభం
12:06 am