ఓట్ల కోసం కొత్త పథకాలు : వైఎస్‌ షర్మిల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఓట్ల కోసం కొత్త, పాత పథకాలకు కేసీఆర్‌ తెరలేపుతున్నారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఇండ్లకు పైసలిస్తామంటూ, పోడు పట్టాలిస్తామంటూ నమ్మబలుతున్నారని విమర్శించారు. బీసీలకు ఆర్థిక సాయం చేస్తామంటూ కొత్త మోసానికి తెరలేపారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ఎన్నికల జిమ్మిక్కులను తాము బయట పెడుతామని హెచ్చరించారు.