సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌

New Suspense Thriller‘తెలుగు ఇండిస్టీని షేక్‌ చేసేలా సిల్వర్‌ స్క్రీన్‌పై మునుపెన్నడూ చూడని థ్రిల్లింగ్‌ సబ్జెక్టుతో ‘వీ4వీ’. (మోటీవ్‌ ఫర్‌ మర్డర్‌ అనేది ట్యాగ్‌లైన్‌) చిత్రాన్ని తెరకెక్కించాం అని దర్శక, నిర్మాత మోహన్‌ వడ్లపట్ల అన్నారు. తెలుగుతో పాటు ఐదు భాషల్లో ఈచిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఒకే ఒక కిల్లర్‌ క్యారెక్టర్‌తో ఉన్న ఈ పోస్టర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మోహన్‌ వడ్లపట్ల మాట్లాడుతూ, ‘సరి కొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇండిస్టీలో ఏ ఫెదర్‌ ఇన్‌ క్రౌన్‌ అవ్వబోతోంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌, మర్డర్‌ మిస్టరీ జోనర్లో ఇదొక కలికితురాయిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. టాలీవుడ్‌, బాలీవుడ్‌తో పాటు అమెరికాలోనూ ఈ సినిమా ప్రమోషన్స్‌ మొదల య్యాయి. వసంత్‌ మ్యూజిక్‌, ఆనంద్‌ పవన్‌ ఎడిటింగ్‌, సంతోష్‌ షానమోని కెమెరా పనితనం.. హాలీవుడ్‌ రేంజ్‌లో వచ్చాయి’ అని అన్నారు. మోహన్‌ మీడియా క్రియేషన్స్‌, జో శర్మ మెక్‌విన్‌ గ్రూప్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రంలో జో శర్మ, సంబీత్‌ ఆచార్య ముఖ్య పాత్రధారులు.