కోట్‌పల్లి ప్రాజెక్ట్‌కు కొత్త జలకళ

– ప్రమాదాలు అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు
– ప్రాజెక్టు సందర్శించిన డీఎస్పీ కోణం నర్సింలు
నవతెలంగాణ-ధారూరు
హైదరాబాద్‌ అతి సమీపంలో ఉన్నటువంటి అత్యంత సుందరమైన అతి పెద్ద ప్రాజెక్టు కోట్‌పల్లి వికారాబాద్‌ జి ల్లాలో సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తున్నది. ప్రస్తు తానికి కురుస్తున్న వర్షాల వల్ల కోట్‌పల్లి ప్రాజెక్టు కొత్త శోభ ను సంతరించుకున్నది. ఆ అందాలను ఆస్వాదించ డానికి వస్తున్న సందర్శకుల సంరక్షణార్థం చర్యలు చేపట్టడానికి పోలీస్‌ డిపార్ట్‌మెట్‌ వారు తగు చర్యలు తీసుకుంటుంది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కొన్ని రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు చెరువు నిండి నిండు కుండలా ప్రవహిస్తున్నది. ఇలాంటి తరుణంలో సందర్శకు లకు ఎలాంటి అనుమతులూ లేవని సందర్శించే ప్రయ త్నం చేయొద్దని తెలిపారు. జాలర్లు చేపలు పట్టడానికి ప్రయత్నం చేయవద్దని నీరు భారీగా ప్రవహిస్తున్న సంద ర్భంలో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. చెరువు లో ఈతకు దిగడం లాంటివి చేయరాదని ఇంత ముందు జరిగిన ప్రమాదలని దృష్టిలో ఉంచుకుని ముందుచూపుగా కట్టదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని మండల పోలీ సు బృందానికి సూచించారు. వాగులు, వంకలు, చెరువు లు ప్రవహి స్తున్నప్పుడు ప్రజలు దాటే ప్రయత్నం చేయవ ద్దని ప్రాజెక్టుల వల్ల చెరువుల వద్ద ప్రమాద సూచిక బోర్డు లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదే శించారు. గ్రామాల ప్రజలు సహకరించాలని పోలీసువారి సూచనలను పాటించాలన్నారు. దారుర్‌ సీఐ రామకృష్ణ ఎస్సై సంతోష్‌ కుమార్‌, పోలీస్‌ బృందం పాల్గొన్నారు.