కొత్తగా 17బీసీి డిగ్రీ గురుకులాలు

–  మంత్రి గంగుల కమలాకర్‌
నవతెలంగాణబ్యూరో -హైదరాబాద్‌
రాష్ట్రవ్యాప్తంగా 17 నూతన బీసీి డిగ్రీ గురుకులాలు ప్రారంభించటానికి ప్రభుత్వం జీవో జారీ చేసిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణలో పూర్వం కేవలం 19 బీసీ గురుకులాలు అరకొర వసతులతో ఉండేవనీ, సీఎం కేసీఆర్‌ సంకల్పంతో వాటి సంఖ్యను 327కు పెంచుకున్నామని తెలిపారు. విద్య ద్వారా వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పులు వస్తాయని పేర్కొన్నారు. బీసీి గురుకులాల ద్వారా రాష్ట్రంలో దాదాపు 2లక్షల మంది వెనుకబడిన విద్యార్థులు ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. విద్యాసంవత్సరంలో జోగులాంబ గద్వాల్‌, నారాయణ్‌ పేట్‌, నాగర్‌ కర్నూల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, అదిలాబాద్‌, కొమరంబీం అసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో బీసీ గురుకులాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు.