నవతెలంగాణ హైదరాబాద్: అధునాతన సాంకేతికతలలో భారతదేశ యువత నైపుణ్యాన్ని పెంపొందించడంలో అగ్రగామిగా ఉన్న నెక్ట్స్‌వేవ్, ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ టెక్నాలజీ ఫాస్ట్ 50 ఇండియా 2024 అవార్డులలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 50 టెక్నాలజీ కంపెనీలలో ఒకటిగా గుర్తింపు దక్కించుకుంది. గతంలో రాజోర్‌పే (Razorpay), జొమాటో (Zomato), క్యాషిఫై (Cashify), డార్విన్‌బాక్స్ (Darwinbox), జెప్టో (Zepto) వంటి పరిశ్రమలు దక్కించుకున్న ఈ ప్రశంసను ఇప్పుడు ఎడ్‌టెక్ పరిశ్రమలో సాంకేతికతను చక్కగా ఉపయోగిస్తూ అద్భుతమైన వృద్ధిని సాధించిన నెక్ట్స్‌వేవ్ దక్కించుకుంది.
డెలాయిట్ టెక్నాలజీ ఫాస్ట్ 50, పలు సంవత్సరాలుగా, దేశంలోని టెక్ వ్యవస్థాపకులకు అత్యంత ఆకాంక్షించదగిన గౌరవనీయమైన గుర్తింపులలో ఒకటిగా మారింది. ఈ జాబితాలో అత్యంత పోటీతత్వం, కొత్త తరం, చురుకైన వ్యాపారాలు ఉండగా, ఇవి రాబడి, వృద్ధిపై దృష్టి పెట్టడమే కాకుండా స్థిరత్వం, ఆర్థిక చేరిక, వైద్య సాంకేతికత, తదితర రంగాలలో సమస్యలను, సామాజిక సవాళ్ల పరిష్కరిస్తున్న సంస్థలు ఉన్నాయి. డెలాయిట్ ఇండియా భాగస్వామి, టీఎంటీ ఇండస్ట్రీ లీడర్ పీయూష్ వైష్ మాట్లాడుతూ, ‘‘భారత సాంకేతిక రంగం పరివర్తనాత్మక కూడలిలో ఉంది. ఆవిష్కరణ-కేంద్రీకృత విధానాలు, వృద్ధి చెందుతున్న డిజిటల్ ఇన్‌క్లూజివిటీ, ప్రపంచ గుర్తింపుతో, భారతదేశ సాంకేతిక పర్యావరణ వ్యవస్థ కొత్త కొలమానాలను నెలకొల్పుతోంది. డెలాయిట్ టెక్‌ఫాస్ట్ 50 అనేది విజేతల చురుకుదనం, స్కేలబిలిటీ మరియు ప్రభావవంతమైన ఆవిష్కరణలకు ఉదాహరణ డెలాయిట్‌లో 50 వేగవంతమైన సాంకేతికత కంపెనీలలో ఒకటిగా గుర్తించబడినందుకు భారతదేశంలో మేము వారితో కలిసి మెరుగైన భవిష్యత్తులను నిర్మించే ఈ ప్రయాణానికి మద్దతు ఇస్తున్నందుకు మేము గర్విస్తున్నాము’’ అని తెలిపారు. ఈ అవార్డు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, ఇతర అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తూ విద్య రంగంలో అనూహ్య మార్పులు తీసుకువస్తున్న నెక్ట్స్‌వేవ్ సంకల్పాన్ని, శ్రమని గుర్తిస్తుంది.
నెక్ట్స్‌వేవ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రాహుల్ అత్తులూరి మాట్లాడుతూ, ‘‘డెలాయిట్ టెక్నాలజీ ఫాస్ట్ 50 ఇండియా 2024 అవార్డును అందుకోవడం మాకు గౌరవంగా ఉంది. ఈ గుర్తింపు ఒక జట్టుగా మేము సాధించిన అద్భుతమైన పురోగతికి నిదర్శనం. నెక్ట్స్‌వేవ్‌లో మేము సాంకేతికతను ఏకీకృతం చేస్తూ మా విద్యార్థులకు సాటిలేని విలువను సృష్టించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. నెక్ట్స్‌మాక్ (NxtMock), ఏఐ ట్యూటర్‌లు మరియు మెటావర్సిటీ ఏఐ-ఆధారిత పరిష్కారాల ద్వారా విద్యార్థులకు మెరుగైన ట్రైనింగ్ అందిస్తూ మా వ్యాపార కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేస్తున్నాము. ఎంతో వేగంగా మార్పులు చేస్తున్నప్పటికీ మేము సాంకేతికత పూర్తి సామర్థ్యంలో 10-20% మాత్రమే గ్రహించాము. అన్ని అవకాశాలను అందిపుచ్చకుంటూ రాకెట్ వేగంతో మేము ముందుకు సాగుతున్నాము’’ అని తెలిపారు.
నెక్ట్స్‌వేవ్ విజయం వినూత్న పరిష్కారాలపై నిర్మించబడింది. ఉదాహరణకు నెక్ట్స్‌మాక్ (NxtMock), విద్యార్థులను ప్లేస్‌మెంట్‌ల కోసం సిద్ధం చేసే ఏఐ-ఆధారిత మాక్ ఇంటర్వ్యూల ప్లాట్‌ఫారమ్‌గా వ్యవహరిస్తోంది. అలానే ఏఐ ట్యూటర్లు, మెంటర్లు వ్యక్తిగతీకరించిన, ఏఐ-ఆధారిత అభ్యాసం, ప్రశ్నకు పరిష్కారాన్ని అందిస్తారు. మెటావర్సిటీ లీనమయ్యే వర్చువల్ లెర్నింగ్ అనుభవాలను అందిస్తుంది. అడ్వాన్స్‌డ్ లెర్నింగ్ పోర్టల్ ఆన్‌లైన్ ఐడీఈలను, బలమైన లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుంది. విద్యార్ధుల కోసం చేసే ఆవిష్కరణలతో పాటుగా, నెక్ట్స్‌వేవ్ ప్రీ-సేల్స్, స్టూడెంట్ సక్సెస్‌లలో కాల్ ఆడిట్, ఇంటెలిజెన్స్‌తో కార్యాచరణ సామర్థ్యం కోసం ఏఐని ఉపయోగిస్తుంది. ఏఐ- ఆధారిత కంటెంట్ సృష్టించడం ద్వారా బ్రాండింగ్, సోషల్ మీడియాను మెరుగుపరుస్తుంది. ఇంటర్వ్యూ విశ్లేషణ మరియు ఇంటెలిజెన్స్ ప్లేస్‌మెంట్ ఫలితాలను ఆప్టిమైజ్ చేస్తుంది. ఈ గుర్తింపు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ట్రైనింగ్ రెండింటిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చే సాంకేతిక కంపెనీగా మారాలనే నెక్ట్స్‌వేవ్ దృష్టిని చాటి చెబుతోంది.