– ఎంపీ రంజిత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
– బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు ఆర్.జయసింహ
నవతెలంగాణ-శంషాబాద్
సిద్ధాంతి శంషాబాద్ జాతీయ రహదారి-44 అదన పు ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని బీఎస్పీ రాజేంద్రనగర్ నియోజకవర్గం అధ్యక్షులు రాచమల్ల జయసింహ డిమాండ్ చేశారు. అదనపు ఫ్లైఓవర్ నిర్మిస్తా మని దానికి మూడు నెలల సమయం కావాలని చేవెళ్ల ఎంపీ జి. రంజిత్‌రెడ్డి ఇచ్చిన మాట గడువు తీరడంతో శంషాబాద్ ప్రజల ఆందోళన మేరకు ఆయన శంషాబాద్‌లో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ హైవే పై ఫ్లైఓవర్ నిర్మాణం చేసి శంషాబాద్ సిద్ధాంతి ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగించారని అన్నారు. కొనసాగింపుగా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని శంషాబాద్ అఖిలపక్షం నేతలు రాజకీయాల కతీతంగా జేఏసీగా ఏర్పడి ఉద్యమం చేశారని అన్నారు. అయితే స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డితో ఉవ్వెత్తున సాగుతున్న ఉద్య మాన్ని ఆపించారని అన్నారు. రెండు నెలల్లోగా ఫ్లైఓవర్ అ దనపు నిర్మాణం కోసం పనులు ప్రారంభిస్తామని ఉద్యమా న్ని విరమించాలని ఉద్యమ సమయంలో ఎంపీ నాయకుల కు మాట ఇచ్చారని అన్నారు. 90 రోజులు దాటిన బ్రిడ్జి నిర్మాణానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. దీంతో సిద్ధాంతి గ్రామ ప్రజలు శంషాబాద్ ప్రజలు రోడ్డు దాటే పరిస్థితులు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణం జరుగితే సమస్య తీరుతుందన్నారు. కానీ ఎంపీ ఇచ్చిన మాట నెరవేరలేదని తెలిపారు. మాట ఇచ్చి ఎందు కు పనులు మొదలు పెట్టలేదో ఎంపీ, బీఆర్‌ఎస్ నాయకు లు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉవ్వెత్తున ఎగసిన ఉద్య మాన్ని హామీలు ఇచ్చి విరమింపజేసింది కేవలం కాంట్రా క్టర్లకు వత్తాసు పలికి బిల్లులు ఇప్పించటానికేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను నెరవేర్చలేని బీఆర్‌ఎస్ నాయకు లకు వచ్చే ఎన్నికలలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఇప్పటికైనా ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని లేదంటే మరో దఫా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యపచెట్టు యాదగిరి, చిన్నగం డు భాస్కర్, పెద్దగండు నర్సింగరావు, పెద్దగండు హరిసు ధన్, కొమ్మూరి యాదయ్యగౌడ్, రాచమల్ల క్రాంతి, భరత్ పాల్గొన్నారు.