వితంతువులపై వివక్ష వద్దు

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
వితంతువులపై వివక్ష వద్దని హుస్నాబాద్ మాజీ సర్పంచ్ బాలవికాస వాటర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కేడం లింగమూర్తి అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ మండలం లోని తోటపల్లి గ్రామంలో బాలవికాస ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కలిపించారు. ఈ సందర్భంగా బాలవికాస వాటర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కేడం లింగమూర్తి మాట్లాడుతూ.. ఆడవారికి చిన్న వయసులో భర్త చనిపోతే వీలైతే వారికి మళ్ళీ పెళ్లి చేయలని కోరారు. భర్త చనిపోతే శుభకార్యాలకు దూరం పెట్టడం, సమాజం చిన్నచూపు చూసి మనోవేదనను గురి చేస్తుంటారని అన్నారు. వితంతువులకు చేదోడువాదోడుగా ఉంటూ వారికి మనోధైర్యం నింపాల్సిన బాధ్యత ప్రతి మహిళల పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ సుంకే రాజశేఖర్, కోఆర్డినేటర్లు జ్యోతి, శ్రీమతి, నిర్మల అధ్యక్షురాలు కవిత స్వప్న, లక్ష్మి మహిళా సంఘాల లీడర్లు పాల్గొన్నారు.