నవతెలంగాణ-రఘునాధపాలెం
పాలేరు నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థిగా తమ్మినేని వీరభద్రం ఈనెల 9న నామినేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని, మంగళవారం రూరల్ మండలం కామంచికల్లు, ముత్యాలగూడెం, పాటివారి గూడెం జాన్ బాధ్ తండాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జోన్ కమిటీ బాధ్యులు పి.సంగయ్య మాట్లాడుతూ ప్రజల కోసం సిపిఎం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిందన్నారు. ఈ ఎన్నికల్లో మన అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో మండల కమిటీ బాధ్యులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు, గిరిజన సంఘం జిల్లా బాధ్యులు భూక్య కృష్ణ, కామంచికల్ శాఖ కార్యదర్శి అనంతిని వీరయ్య, సభ్యులు చెరుకూరు మురళి, చెరుకూరి వెంకట నరసయ్య, హనుమంతు శేషగిరి, చిరంజీవి జాన్ బాద్ తండా కార్యదర్శి కోటేష్, మంగ్య, సూక్య సభ్యులు పాల్గొన్నారు.