నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
షెడ్యూల్డ్ కులాల అభివద్ధి శాఖకు చెందిన రాష్ట్ర స్టడీసర్కిల్స్‌లో 2023-24 సంవత్సరం కోసం సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ (పదినెలల రెసిడెన్షియల్) కోచింగ్ కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు స్టడీసర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోనిరాష్ట్ర స్టడీ సర్కిల్‌లో కోచింగ్ కోసం వంద మందిని రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తామన్నారు. వారికి ఉచిత భోజనం, వసతితో పది నెలలు శిక్షణ ఇస్తామన్నారు. ప్రిలిమినరీ, మెయిన్స్ సబ్జెక్టుల (పాలిటి, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్)లో దాదాపు వెయ్యి గంటలకు పైగా, ఆప్షనల్ సబ్జెక్టులపై ఒక్కోదానికై నూటయాభై నుంచి రెండు వందల గంటలకు పైగా శిక్షణ ఉంటుందన్నారు.