నవతెలంగాణ – బెంగళూరు: 07 జూన్ 2023: PhonePe తన స్మార్ట్ స్పీకర్లలో వాయిస్ పేమెంట్ నోటిఫికేషన్లను తెలుగులో వినగలిగే ఫీచర్‌ను ఈరోజు ప్రకటించింది. ప్రాంతీయ భాషలలో నోటిఫికేషన్లను అందించడం ద్వారా, ఇకపై వ్యాపారులు తమ కస్టమర్ల పేమెంట్లను తమకు కావాల్సిన భాషలలోనే వినిపిస్తాయని తక్షణమే నిర్ధారించుకోవచ్చు. ఇందుకోసం కస్టమర్ ఫోన్ స్క్రీన్‌ను చెక్ చేయడం గానీ బ్యాంక్ నుండి పేమెంట్ నిర్ధారణ SMS కోసం వేచి ఉండటం గానీ చేయాల్సిన పని లేదు. ప్రత్యేకించి బిజినెస్ రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. PhonePe స్మార్ట్ స్పీకర్లను ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19 వేల పిన్ కోడ్‌లలోని (దేశంలో 90% కంటే ఎక్కువ భూభాగాన్ని కవర్ చేసేంతగా) వ్యాపార భాగస్వాములు వాయిస్ పేమెంట్ నోటిఫికేషన్ల కోసం ఉపయోగిస్తున్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 21 లక్షల వ్యాపార భాగస్వాములకు PhonePe ఈ డిజిటల్ టెక్నాలజీని అందిస్తోంది. వీరంతా QR కోడ్లను, అలాగే ఇతర సరికొత్త టూల్స్‌ను యాక్టివ్‌గా ఉపయోగించుకుంటున్నారు. వాయిస్ పేమెంట్ నోటిఫికేషన్లను తెలుగులో అందించే ఈ ఫీచర్ ద్వారా, ఇకపై తమకు నచ్చిన భాషలో PhonePe స్మార్ట్ స్పీకర్లను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్, PhonePe for Business యాప్‌లోనే ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా అందుబాటులో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోనే PhonePe స్మార్ట్ స్పీకర్ల ద్వారా నెలకు సగటున 6 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయంటే, అవి ఎంత జనాదరణ పొందాయో అర్థమవుతోంది. కొత్త ఫీచర్ల గురించి మాట్లాడుతూ PhonePeలో ఆఫ్‌లైన్ బిజినెస్ విభాగానికి అధిపతి అయిన వివేక్ లోహ్చెబ్ ఇలా అన్నారు : “డిజిటల్ పేమెంట్లను దేశం నలుమూలలా తీసుకెళ్లాలనేదే మా ప్రయత్నం. దీనిలో భాగంగా వ్యాపారులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించి, తద్వారా మా స్మార్ట్ స్పీకర్ పరికరాలను వ్యాపారులు అత్యుత్తమ రీతిలో వినియోగించేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ధ్యేయంలో భాషా పరమైన సవాళ్లను పరిష్కరించడం కూడా ఒక భాగం. పేమేంట్ల నిర్ధారణ కోసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, భారతదేశంలోని ప్రతి ఒక్క వ్యాపారి మా పరికరాలను వినియోగించుకోగలిగేలా చేయడానికి వ్యాపారులకు ఉండే ప్రత్యేక అవసరాలను తీర్చేందుకు మా సేవలను లోకలైజ్ చేసి, అందరికీ అనుకూలంగా మార్చుతున్నాం.”
వ్యాపారులు PhonePe స్మార్ట్ స్పీకర్లో తమకు నచ్చిన భాషను డౌన్లోడ్ చేసుకుని ఎంచుకునేందుకు ఏం చేయాలో తెలిపే గైడ్‌ను ఇక్కడ ఇచ్చాము:
1) PhonePe for Business యాప్‌ను తెరవండి
2) హోమ్ స్క్రీన్‌లోని SmartSpeaker/స్మార్ట్ స్పీకర్ విభాగానికి వెళ్లండి
3) Language/భాష అనే బార్ కింద, అందుబాటులో ఉన్న వివిధ భాషలలో మీకు కావాల్సిన భాషను ఎంచుకోండి
4) ఎంపిక చేసిన భాష ఆ పరికరంలోకి డౌన్లోడ్ అవుతుంది
5) భాషను అప్డేట్ చేసేందుకు పరికరం రీస్టార్ట్ అవుతుంది
దుకాణాల్లో పేమెంట్లను సులువుగా, నమ్మకంగా ట్రాక్ చేసుకునేందుకు వీలుగా PhonePe గత ఏడాది స్మార్ట్ స్పీకర్లను లాంచ్ చేసింది. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర స్పీకర్లతో పోలిస్తే PhonePe స్మార్ట్ స్పీకర్లలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటంటే: సులువుగా ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లవచ్చు, అత్యుత్తమమైన బ్యాటరీ ఉంది. శబ్దాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కూడా ఆడియో స్పష్టంగా వినబడుతుంది. చిన్నగా, పొందికగా ఉండటం వల్ల ఇరుకైన కౌంటర్లలో కూడా ఈజీగా వాడుకోవచ్చు. గతంలో, ఫీచర్ ఫోన్లు వాడే వ్యాపారులు SMSల మీద ఎక్కువగా ఆధారపడే వారు. అయితే, నేడు PhonePe స్మార్ట్ స్పీకర్లు వచ్చిన తర్వాత పేమెంట్లను నిర్ధారించడం చాలా సులువైంది. PhonePe స్మార్ట్ స్పీకర్లకు 4 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉండటమే కాక, వాటిలో డేటా కనెక్టివిటీతో పాటు, బ్యాటరీ స్థాయిని సులువుగా తెలియజేసే LED ఇండికేటర్, బ్యాటరీ స్థాయి తక్కువ ఉన్నప్పుడు వినిపించే ఆడియో అలర్ట్‌లు, ఇంకా చివరి లావాదేవీని తిరిగి వినిపించేందుకు రీప్లే బటన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.